Header Banner

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ అందుబాటు.. వినియోగదారులు అత్యధికంగా..

  Wed Jun 04, 2025 14:34        Technology

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అత్యధికంగా ఉపయోగిస్తున్న యాప్‌లలో వాట్సాప్ ఒకటి. కోట్లాది మంది వాట్సాప్ యూజర్లు ఉన్నారు. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మెటా యాజమాన్యంలోని ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని సహాయంతో వినియోగదారులు సొంతంగా కస్టమ్ ఏఐ చాట్‌బాట్‌ను సృష్టించుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టర్ల కోసం విడుదల చేయగా, త్వరలోనే మిగతా వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు వ్యక్తిత్వం, రూపాన్ని సైతం డిజైన్ చేసుకోవడానికి చాట్‌బాట్ ఉపయోగపడుతుంది. చాట్‌బాట్ సిద్ధమయిన తర్వాత వినియోగదారులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుందని సమాచారం. తాజా ఫీచర్ త్వరలోనే వాట్సాప్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా దశలో ఉండగా, బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!

 

వర్చువల్ సిస్టమ్‌ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Whatsapp #Tech-News #SmartPhones #AI #NewFeature #AIChatBot